నాని హీరోయిన్ తో సుధీర్…. సుధీర్ భామ తో నాని….!

నాని, సుధీర్ బాబు…. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో వరుస సినిమాలతో అందరికంటే ముందున్నారు. ఇప్పటికే నాని వరుస సినిమాల తో దూసుకు పోతుండగా, సుధీర్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. వీళ్ళ ఇద్దరితో ఇంతకు ముందు హిట్ సినిమాలు తీసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఇప్పుడు ఇద్దరినీ పెట్టి ఒక సినిమా తియ్యాలనుకుంటున్నాడట.

సమ్మోహనం సక్సెస్ తర్వాత మోహన్ కృష్ణ చిన్న బ్రేక్ తీసుకొని ఒక కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే ముందు వేరే హీరోల తో ఈ సినిమాని ముందుకు తీసుకేల్దాం అని అనుకున్నారట. కానీ చివరికి మళ్ళీ నాని, సుధీర్ ల తోనే సెట్ చేశాడట ఈ ప్రాజెక్ట్ ని. మోహన్ కృష్ణ కి ఇదివరకే ఇద్దరితో పని చేసిన అనుభవం ఉండడం వల్ల ప్రాజెక్ట్ ఈజీ అయింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో అదితి రావ్ హైదరి ని, నివేదా థామస్ ని హీరోయిన్స్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఇంతకు ముందు వీరిద్దరూ మోహన్ కృష్ణ తో పని చేసారు. ఆసక్తికర అంశం ఏంటి అంటే, ఇంతకు ముందు నివేదా థామస్ నాని సరసన నటించగా, ఈ సినిమా లో మాత్రం సుధీర్ తో నటించనున్నది. అలాగే అదితి ఇంతకు ముందు సుధీర్ సరసన నటించగా, ఇప్పుడు నాని సరసన నటిస్తుంది.