టీడీపీని 1980లో స్థాపించారట….

మంత్రి నారా లోకేష్ మరోసారి నవ్వులపాలయ్యారు. పార్టీ ఎప్పుడు స్థాపించారో కూడా గ్రహించకుండా మీడియా వద్ద ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన లోకేష్… అక్కడి టీడీపీ నేతలు గంజి చీరంజీవి, టికెట్ ఆశించి ఇటీవల పార్టీలో చేరిన కాండ్రు కమలను బుజ్జగించేందుకు లోకేష్ వచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్ 1980 నుంచి మంగళగిరిలో టీడీపీ గెలవలేదని… ఈసారి తాను గెలవాలా లేదా అన్నది ఇక్కడి ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. 

టీడీపీని 1982లో స్థాపిస్తే… 1980 నుంచి మంగళగిరిలో టీడీపీ గెలవలేదని లోకేష్ చెప్పిన లెక్క అర్థం కాక నేతలు కంగుతిన్నారు. పైగా తాను తప్పకుండా గెలుస్తానని చెప్పాల్సింది పోయి ఇప్పటి వరకు పార్టీ గెలవలేదు.. తాను గెలుస్తానో లేదో ప్రజలే చెబుతారనడం చర్చనీయాంశమైంది.