దిల్ రాజు చేతికి చిక్కిన సూర్యకాంతం

మెగా డాటర్ నిహారిక కొణిదెల నటించిన సూర్యకాంతం సినిమా విడుదలకు సిద్ధమైంది. మొన్నటివరకు రిలీజ్ కష్టాలు చూసిన ఈ మూవీకి ఇప్పుడు కంప్లీట్ గా లైన్ క్లియర్ అయింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా హక్కులు దక్కించుకున్నాడు. ఏపీ, తెలంగాణకు చెందిన పూర్తి థియేట్రికల్ రైట్స్ ఇప్పుడు దిల్ రాజు సొంతమయ్యాయి.

తాజా సమాచారం ప్రకారం, సూర్యకాంతం సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ అటుఇటుగా 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖర్చులతో కలుపుకొని దాదాపు 3 కోట్ల 60 లక్షల రూపాయలు రావాలన్నమాట.

హీరో రాహుల్ విజయ్, హీరోయిన్ నిహారికకు అంత మార్కెట్ లేదు. కానీ ప్రస్తుతం థియేటర్లలో ఉన్న గ్యాప్స్ ను సూర్యకాంతంతో భర్తీచేస్తే రెవెన్యూ జనరేట్ చేయొచ్చని దిల్ రాజు భావిస్తున్నాడు. మొన్నటికిమొన్న 118 సినిమా విషయంలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు దిల్ రాజు. అతి త్వరలో థియేటర్లలోకి రాబోతోంది సూర్యకాంతం సినిమా. ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ సినిమాకు దర్శకుడు.