సాహో హీరోయిన్ కి అనూహ్యమైన షాక్

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం సౌత్ లో అడుగు పెట్టింది. తన మొదటి తెలుగు చిత్రం సాహో ద్వారా ఇప్పటికే వార్తల్లో నిలిచింది. ఇటీవలే ఆమె పుట్టిన రోజు కానుక గా చిత్ర యూనిట్ ఒక వీడియోను కూడా విడుదల చేసారు.

అయితే, ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ హీరోయిన్ కి ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ తాను సైనా నెహ్వాల్ బయోపిక్ చేస్తున్నట్టు ప్రకటించింది.

హైదరాబాద్ లో సాహో షూట్ కోసం వచ్చిన ప్రతి సారి సైనా ని కలిసి తన వర్క్ గురించి మాట్లాడడం కూడా చేసేది. అంతే కాకుండా సైనా పర్సనల్ కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద నెల రోజుల పాటు బాడ్మింటన్ లో శిక్షణ కూడా తీసుకున్నారు.

అయితే ఇప్పుడు సడన్ జలక్ ఏంటి అంటే సినిమా నుండి శ్రద్ధ ని తీసేశారు. శ్రద్ధ స్థానంలో ఇప్పుడు కొత్తగా పరినితీ చోప్రా ని తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై చిత్ర వర్గాలు అధికారికంగా ఒక ప్రకటన ని కూడా ఇచ్చారు. ఇప్పుడు పరినితీ తో సినిమా మొదలు పెట్టి వచ్చే సంవత్సరం లోపు సినిమా విడుదల చేయాలని ప్లాన్.