Telugu Global
Cinema & Entertainment

సెంటిమెంట్ తో అమ్మాయి పేరు ను టైటిల్ గా పెట్టుకున్న రవితేజ 

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరోలలో రవితేజ కూడా ఒకడు. వరుసగా మూడు డిజాస్టర్లు అందుకున్న రవితేజ ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇంకా పూర్తవ్వలేదు. అప్పుడే మరొక చిత్రాన్ని లైన్ లో పెట్టాడు రవితేజ. సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో […]

సెంటిమెంట్ తో అమ్మాయి పేరు ను టైటిల్ గా పెట్టుకున్న రవితేజ 
X

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరోలలో రవితేజ కూడా ఒకడు. వరుసగా మూడు డిజాస్టర్లు అందుకున్న రవితేజ ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ఇంకా పూర్తవ్వలేదు. అప్పుడే మరొక చిత్రాన్ని లైన్ లో పెట్టాడు రవితేజ. సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రానికి ‘కనకదుర్గ’ అనే టైటిల్ పెడదామని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రం స్క్రిప్టు కు ఫైనల్ టచ్ ఇస్తున్నారని, ఆ పని పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

ఒకవైపు ‘డిస్కో రాజా’ షూటింగ్ తో పాటు ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేయనున్నారు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా తర్వాత రవితేజ మార్కెట్ బాగా పడిపోవడంతో ఈ రెండు సినిమాల పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు మాస్ మహారాజా.

ఈ నేపథ్యంలోనే అమ్మాయి పేరు ను పెట్టుకుంటే కలిసొస్తుంది అని ఈ సినిమాకు ‘కనకదుర్గ’ అనే టైటిల్ పెట్టడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ ఈ పేరు రవితేజ కు ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.

First Published:  14 March 2019 10:57 PM GMT
Next Story