శృతి హాసన్ అబ్బాయి అయితే…. తమన్నాతో డేట్ చేసేదట!

సినిమా రంగంలో చాలా మంది స్నేహితులు ఉంటారు. కానీ అందులో కొంత మంది మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతారు. అలాంటి హీరోయిన్ లలో శృతి హాసన్, తమన్నా మంచి స్నేహితులు గా కంటిన్యూ అవుతున్నారు.

అయితే ఎప్పుడు అవకాశం ఉన్నా, ఈ ఇద్దరూ కలిసి పార్టీ లు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవలే శృతి హాసన్ ఒక చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొని ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.

ఆ కార్యక్రమం లో శృతి హాసన్ ను…. ఒక వేళ అబ్బాయిగా పుట్టి ఉంటే ఏ హీరోయిన్ తో డేట్ చేయడానికి ఇష్ట పడతావు అని అడగ్గా…. తడుముకోకుండా తమన్నా పేరు చెప్పేసింది.

“ఒకవేళ నేను గనుక అబ్బాయిగా పుట్టి ఉంటే, తమన్నాతో డేట్ చేసే దాన్ని…. తమన్నా అంటే నాకు చాలా ఇష్టం. తమన్న మంచి అమ్మాయి. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తనని మాత్రం అస్సలు వదిలి పెట్టను” అని చెప్పింది శృతి.

ఇక సినిమా ల విషయానికి వస్తే, తమన్నా కి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. కానీ శృతి మాత్రమే ఇంకా ఖాళీగా ఉంది.