Telugu Global
NEWS

వారసులేనా... పనిచేసే వారు పనికిరారా?... తెలుగు తమ్ముళ్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్దుల తొలి జాబితాను విడుదల చేసారు. 126 మంది అభ్యర్దులతో ప్రకటించిన ఈ జాబితాలో 10 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల వారసులు ఉండడం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తో సహా మరో 9 మంది వారసులకు టిక్కెట్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. దీనిపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని […]

వారసులేనా... పనిచేసే వారు పనికిరారా?... తెలుగు తమ్ముళ్లు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్దుల తొలి జాబితాను విడుదల చేసారు. 126 మంది అభ్యర్దులతో ప్రకటించిన ఈ జాబితాలో 10 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల వారసులు ఉండడం చర్చనీయాంశం అవుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తో సహా మరో 9 మంది వారసులకు టిక్కెట్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. దీనిపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిని కాదని తమ వారసులకు టిక్కెట్లు ప్రకటించడం పై సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోందని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ ను ముందుగా విశాఖ జిల్లా నుంచి పోటీ చేయించాలని భావించారు. అయితే అక్కడ మంత్రి గంటా శ్రీనివాస్ తో సహా తెలుగుదేశం నాయకులు లోకేష్ అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదనను వదులుకున్నారు.

ఇప్పుడు ఆయనను మంగళగిరి నుంచి బరిలోకి దింపుతున్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. స్దానికంగా ఉన్న ఐదారుగురు తెలుగుదేశం నాయకులు మంగళగిరి టిక్కెట్టు తనకి వస్తుందని గడచిన నాలుగు సంవత్సరాలుగా పలు కార్యక్రమాలు చేపట్టారు. లోకేష్ తెరమీదకు రావడంతో వారంతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇక పలాస నుంచి గౌతు శివాజీ కుమార్తే గౌతు శిరీష, చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే మృణాళిని కుమారుడు నాగార్జున, రాజమండ్రి అర్బన్ నుంచి ఆదిరెడ్డి భవానికి టిక్కెట్లు ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి ఎర్రంనాయుడు కుమార్తెకు, తెలుగుదేశం నాయకుడు ఆదిరెడ్డి అప్పరావు కోడలైన భవానికి ఎలా టిక్కెట్టు ఇస్తారంటూ స్దానిక నాయకులు బాబును ప్రశ్నిస్తున్నారు.

గుడివాడ నుంచి దేవినేని నెహ్రు కుమారుడు అవినాష్ కు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జాలీల్ ఖాన్ కుమార్తె షబాన కు టిక్కెట్లు ఇచ్చారు. గుడివాడకు చెందిన తెలుగుదేశం నాయకులు అవినాష్ కు టిక్కెట్టు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జాలీల్ ఖాన్ కుమార్తెకు టిక్కట్టు ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. తామూ ఎన్నాళ్ళ నుంచో స్థానికంగా పనిచేస్తున్నామని, తమను కాదని ఎన్ఆర్ఐ అయిన షబాన కు టిక్కెట్టు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఇక నగరి నుంచి పోటీ చేస్తున్న గాలి ముద్దుక్రిష్ణమ నాయుడి కుమారుడు గాలి భానుప్రకాష్, శ్రీ కాళహస్తి అభ్యర్ది బొజ్జల గోపాలక్రిష్ణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి అభ్యర్ధిత్వాలపై కూడా స్ధానిక నాయకులు మండిపడుతున్నారు.

First Published:  14 March 2019 11:56 PM GMT
Next Story