Telugu Global
NEWS

మీ పుత్రోత్సాహము పుట్టి ముంచుతోంది : దేశం పోలిట్ బ్యూరో

“మేం ముందునుంచి చెబుతూనే  ఉన్నాం. లోకేషన్ ను ఇంత త్వరగా రాజకీయాల్లోకి తీసుకు రావద్దు. కొన్నాళ్లపాటు క్షేత్రస్థాయిలో పని చేస్తే అనుభవం వస్తుంది అని. మీరు మా మాట వినకుండా పుత్రోత్సాహంతో ఆయనను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. పైగా మంత్రిని చేశారు. ఈ పుత్రోత్సాహము ఇప్పుడు పుట్టి ముంచుతోంది”…. ఇవి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుల మాటలు. రెండున్నర దశాబ్దాలుగా పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం అంటే కేవలం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే […]

మీ పుత్రోత్సాహము పుట్టి ముంచుతోంది : దేశం పోలిట్ బ్యూరో
X

“మేం ముందునుంచి చెబుతూనే ఉన్నాం. లోకేషన్ ను ఇంత త్వరగా రాజకీయాల్లోకి తీసుకు రావద్దు. కొన్నాళ్లపాటు క్షేత్రస్థాయిలో పని చేస్తే అనుభవం వస్తుంది అని. మీరు మా మాట వినకుండా పుత్రోత్సాహంతో ఆయనను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. పైగా మంత్రిని చేశారు. ఈ పుత్రోత్సాహము ఇప్పుడు పుట్టి ముంచుతోంది”…. ఇవి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుల మాటలు.

రెండున్నర దశాబ్దాలుగా పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం అంటే కేవలం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే మాట్లాడేవారు. అయితే ఈ సంప్రదాయానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని లో గురువారం జరిగిన అత్యవసర పోలిట్ బ్యూరో సమావేశంలో సభ్యులందరూ చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, ప్రతి చోట రెండు మూడు గ్రూపులతో పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది అని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టికెట్లు ఆశిస్తున్న వారు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. వారంతా నారా లోకేష్ నుంచి టికెట్లు హామీలు తీసుకున్న వారేనని చంద్రబాబు దృష్టికి పోలిట్ బ్యూరో సభ్యులు తీసుకొచ్చారంటున్నారు.

అభ్యర్థుల ప్రకటన సమయంలో గతంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అప్పుడు సీనియర్ నాయకులు కొందరు సముదాయిస్తే టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారు వెనక్కి తగ్గే వారని చెప్పినట్లు సమాచారం. “గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవరిని సముదాయించాలని, బుజ్జగించాలని ప్రయత్నించినా వారంతా తమకు నారా లోకేష్ హామీ ఇచ్చారని, ఆయన భరోసాతోనే నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టామని” చెబుతున్నట్లుగా చంద్రబాబు నాయుడుకు వెల్లడించారు.

మీ కుమారున్ని అందలం ఎక్కించడం కోసం పార్టీని పణంగా పెడుతున్నారని, ఇంతకు ముందు ఈ విషయాన్ని చెప్పడానికి సంకోచించినా… ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పక తప్పడం లేదని పోలిట్ బ్యూరో సభ్యులు కుండబద్దలు కొట్టినట్లు సమాచారం.

ఈ హఠాత్పరిణామంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితులను తాను సరిదిద్దుతానని పోలిట్ బ్యూరో సభ్యులకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

First Published:  15 March 2019 2:08 AM GMT
Next Story