వివేకానందరెడ్డి తలపై గాయం… పోలీసులకు ఫిర్యాదు

వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం వ్యవహారంలో పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన సమయంలో వివేకానందరెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అయితే వివేకానందరెడ్డి తలపై గాయం ఉండడం, బాత్‌రూమ్‌లో రక్తం పడి ఉండడంతో పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో పోలీసులు అనుమానాస్పదమృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం చేసేందుకు తరలించారు.

తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆయన భార్య అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. నిన్న ప్రచారంలో పాల్గొన్న వివేకానందరెడ్డి రాత్రి సిబ్బందిని ఇళ్ళకు పంపించేసి ఒంటరిగా ఇంట్లో పడుకున్నారు. ఉదయం డ్రైవర్‌ వెళ్లి చూడగా చనిపోయి ఉన్నారని చెబుతున్నారు.

వివేకానందరెడ్డి కిందపడ్డారా?…. లేక రక్త వాంతి చేసుకున్నారా, లేక మరో కారణం ఉందా అన్నది పోస్టుమార్టంలో తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు.