యామినీ సాదినేని ఆడియో కలకలం

టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఆమెపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తన కులానికి టికెట్ల కోసం కొందరిని ఆమె రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పలు కులాల వారు, నేతలు… చంద్రబాబు టికెట్ల ఎంపికపై కసరత్తు చేస్తున్న చోట తన అనుచరులతో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ వారికి టికెట్లు ఇవ్వాలంటూ వారంతా ఆందోళన చేస్తున్నారు. వారిని చూసి స్ఫూర్తి పొందిన 
యామిని సాదినేని… కొందరు అనుచరులకు ఫోన్ చేసి సీఎం ముందు ఆందోళన చేసేందుకు రావాలని సూచించారు.

మన కులం వాళ్లు ఓ 20 మంది వచ్చి ఆందోళన చేస్తే నేను మీడియాతో మాట్లాడి కవరేజ్ ఇచ్చేలా చేస్తా అంటూ ఆమె సూచించారు. మన కులానికి ఎక్కువ సీట్లు ఇచ్చేలా ఆందోళన చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ ఆడియో బయటకు వచ్చింది. దీంతో టీడీపీ నేతలు యామినిపై ఊగిపోతున్నారు. నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చి అప్పుడే ఎమ్మెల్యే టికెట్లకు డిమాండ్ చేస్తారా? అని మండిపడుతున్నారు.