మా నాన్నను అందుకే చంపారు – వివేకా కుమార్తె

తన తండ్రిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని చెప్పారు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. వైఎస్ అవినాష్‌ రెడ్డితో కలిసి వెళ్ళి తన తండ్రి హత్యపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సునీత ఫిర్యాదు చేశారు.

తన తండ్రి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. వైసీపీ తరపున ప్రచారం కూడా చేస్తున్నారని… వివేకానంద రెడ్డి ప్రచార కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు ఈ హత్య చేశారని ఆమె ఆరోపించారు.

ఈ హత్యపై దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలని ఫిర్యాదులో ఆమె కోరారు. మరోవైపు ఈ హత్య వెనుక ముమ్మాటికీ మంత్రి ఆదినారాయణరెడ్డి హస్తముందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

జమ్మలమడుగు నియోజవకర్గానికి వైఎస్ వివేకా ప్రచార ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచే ఈ హత్యకు బీజం పడిందని వైసీపీ నేత వెల్లంపల్లి ఆరోపించారు.