వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి కన్నుమూశారు. రాత్రి గుండెపోటుతో ఆయన మృతి చెందారు.

దీంతో వైఎస్‌ కుటుంబం, వైసీపీ శ్రేణులు దిగ్భ్రాంతి చెందాయి. పులివెందులలోని ఆయన ఇంట్లోనే తెల్లవారు జామున వివేకానందరెడ్డికి గుండెపోటు వచ్చింది.

1950 ఆగస్టు 8న ఆయన జన్మించారు. 1989,94 లలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.