Telugu Global
Cinema & Entertainment

'నాన్న నేను' అంటున్న స్టైలిష్ స్టార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రెండు సినిమాలని అంగీకరించాడు. అందులో మొదటిది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వం లో చేయనున్నాడు. మరో సినిమా సుకుమార్ తో ఉంటుంది. కానీ అది ఇప్పుడప్పుడే మొదలయ్యే చాన్స్ లేదు. అయితే త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే హీరోయిన్లుగా రకరకాల పేర్లు వినిపిస్తుండగా, తాజాగా సినిమా టైటిల్ కి సంబంధించిన ఒక పుకారు ఫిలిం నగర్ లో హల్ చల్ […]

నాన్న నేను అంటున్న స్టైలిష్ స్టార్
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రెండు సినిమాలని అంగీకరించాడు. అందులో మొదటిది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వం లో చేయనున్నాడు. మరో సినిమా సుకుమార్ తో ఉంటుంది. కానీ అది ఇప్పుడప్పుడే మొదలయ్యే చాన్స్ లేదు.

అయితే త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే హీరోయిన్లుగా రకరకాల పేర్లు వినిపిస్తుండగా, తాజాగా సినిమా టైటిల్ కి సంబంధించిన ఒక పుకారు ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తోంది.

కొన్ని మీడియా వార్తల కథనం ప్రకారం ఈ సినిమా కి ‘నాన్న.. నేను’ అనే టైటిల్ ని ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. సినిమా లో తండ్రి-కొడుకు సెంటిమెంట్ ఎక్కువ ఉండబోతుందని వినికిడి.

ఇంతకు ముందు బన్నీ, త్రివిక్రమ్ కలయిక లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి లో కూడా ఇదే కథాంశం ఉంది…. కానీ ఆ సినిమా లో తండ్రి పాత్ర ఎక్కువ సేపు ఉండదు. కానీ ఈ సినిమా లో తండ్రి పాత్ర మొదటి నుండి చివరి దాకా ఉండేలా చూస్తున్నాడు దర్శకుడు.

తండ్రి పాత్ర కి ప్రకాష్ రాజ్, బోమన్ ఇరానీ పేర్లు వినిపిస్తున్నా చిత్ర యూనిట్ మాత్రం ఇంకా ఎవరి పేరునూ కన్ఫర్మ్ చేయలేదు.

First Published:  16 March 2019 12:57 AM GMT
Next Story