‘మహర్షి’ షూటింగ్ లొకేషన్ లో లైట్ మెన్ మృతి

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ లొకేషన్ లో ఒక వ్యక్తి చనిపోయిన వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ జరుగుతున్న సమయంలో లో సెట్ వేసే పనిలో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. అప్పుడు సెట్ లో  కృష్ణారావు అనే లైట్ మెన్ కు కరెంట్ షాక్ తగలడంతో అక్కడే మృత్యువాత పడ్డాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు.

కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు కూడా ధృవీకరించారు. దాంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అంతేకాక కృష్ణారావు మృతదేహాన్ని తిరిగి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి తీసుకువచ్చి ధర్నా కూడా చేశారు.

కృష్ణారావు మరణం తో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాల్సిందేనని వేడుకున్నారు. నిర్మాత నుంచి నష్ట పరిహారం గురించి ఎలాంటి వార్త ఇంకా బయటకు రాలేదు.