ఆ ఇడియట్ ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలియదు

మంచు విష్ణు ప్రస్తుతం ఒక హిట్ సినిమా కోసం చూస్తున్నాడు. వరుస పరాజయాల తర్వాత ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఓటర్ సినిమాని ఇప్పుడు ప్రజల ముందు కి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కొన్ని తప్పుడు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తిరుగుతున్నాయి. వీటి పై మంచు విష్ణు గట్టిగా స్పందించారు.

“దయ చేసి మా సినిమా కి సంబంధించి తప్పు దోవ పట్టించే పోస్టర్లని నమ్మకండి. నేను టిక్ టాక్ వీడియోస్ చేసే ఫ్యాన్స్ ని కలుస్తాను అని వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. నేను ఎప్పుడూ అలాంటి సిల్లీ ప్రమోషన్స్ ని ఒప్పుకున్నది లేదు. అసలు ఆ ఇడియట్ ఇలాంటి తప్పుడు వార్త ఎందుకు సృష్టిస్తున్నాడో తెలియదు. అలాగే మా ఓటర్ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు” అని విష్ణు తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో స్పందించారు.

ఇటీవలే ఓటర్ టీజర్ రిలీజ్ అయ్యింది. సినిమా చూడబోతే ఎలక్షన్స్ ని టార్గెట్ చేయనున్నదని అర్ధం అవుతుంది. మరి కొద్ది రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది.