పరిటాల శ్రీరాం అసెంబ్లీకి వెళ్లాలి… లేదంటే తీవ్ర ఇబ్బందులు తప్పవు – టీడీపీ నేత వార్నింగ్

అనంతపురం జిల్లాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. టీడీపీ నేతలు నేరుగానే వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇటీవలే ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి.. తనను ఎమ్మెల్యేగా గెలిపించండి.. ఆరు నెలలు వదిలేస్తా… ఆతర్వాత కావాల్సిన వారిని నరకండి, చంపండి…. పోలీసులు కూడా అడ్డుకోకుండా ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ఈ టేపు బయటకు వచ్చింది.

ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే టీడీపీ కనగానపల్లి ఎంపీపీ భర్త ముకుందనాయుడు ప్రజలను హెచ్చరించారు. వచ్చేది మా ప్రభుత్వమే. పరిటాల శ్రీరాం అసెంబ్లీకి పోతాడు. ఎన్నికల లోపు అందరూ తెలుగుదేశం వైపు రావాలి. 

లేదంటే మీ ఇష్టం. ఇది బెదిరింపు అనుకోండి, వార్నింగ్ అన్నా అనుకోండి. పద్దతిగా ఉండండి. ఎన్నికల లోపు అందరూ ఇటువైపు ఉండాలి. పొరపాటు జరిగిందంటే మాత్రం వచ్చే మా ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. దానికి రెడీగా
ఉండండి అని ముకుందనాయుడు హెచ్చరించారు.

ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ప్రచార రథం మీద మంత్రి పరిటాల సునీత కూడా ఉన్నారు.