Telugu Global
National

పార్టీని గెలిపించ లేరు.... ఎమ్మెల్యేలను కాపాడలేరు.... మీకు పదవులు ఎందుకు?

“మీ మాటలు విశ్వసించి ఎంతో బలంగా ఉన్న తెలుగు రాష్ట్రాలను రెండుగా విడదీసి తప్పు చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉండడం సహజం. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ ప్రజలు కూడా మనల్ని విశ్వసించడం లేదంటే అది మీ తప్పు కాదా?. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోతున్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించలేక పోతున్నారు. మీకు పార్టీ పదవులు ఎందుకు ఇవ్వాలి” ఇవి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ […]

పార్టీని గెలిపించ లేరు.... ఎమ్మెల్యేలను కాపాడలేరు.... మీకు పదవులు ఎందుకు?
X

“మీ మాటలు విశ్వసించి ఎంతో బలంగా ఉన్న తెలుగు రాష్ట్రాలను రెండుగా విడదీసి తప్పు చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉండడం సహజం. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ ప్రజలు కూడా మనల్ని విశ్వసించడం లేదంటే అది మీ తప్పు కాదా?. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోతున్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించలేక పోతున్నారు. మీకు పార్టీ పదవులు ఎందుకు ఇవ్వాలి” ఇవి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి అన్న మాటలు.

శుక్రవారంనాడు దేశవ్యాప్తంగా అభ్యర్థుల జాబితా ఖరారు అంశంపై ఏ ఐ సి సి భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, మరికొందరు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ అభ్యర్ధులపై చర్చ జరుగుతున్న సమయంలోనే తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ప్రత్యేకంగా మాట్లాడినట్టు సమావేశంలో పాల్గొన్న వారు చెబుతున్నారు.

తెలంగాణలో ఈమధ్యనే ఎన్నికైన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రోజుకొకరు చొప్పున అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడాన్ని రాహుల్ గాంధీ సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. పదవుల కోసం పోటీలు పడడం, పైరవీలు చేయించుకునే నాయకులు తెలంగాణలో పార్టీని కాపాడడంలో మాత్రం శ్రద్ధ చూపించడం లేదని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తారని ప్రచారం జరుగుతుండగా కాంగ్రెస్ నాయకులు మాత్రం చేతులు ముడుచుకు కూర్చోవడం దారుణమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

“ మీరు పదవుల కోసం ఢిల్లీ వస్తారు. పదవులు ఇవ్వగానే ఇక కనపడరు. పార్టీని పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. మిమ్మల్ని నమ్మి మీకు పదవులు ఎందుకు ఇవ్వాలి” అని రాహుల్ గాంధీ మండిపడినట్లు చెబుతున్నారు.

తెలంగాణలో లోక్ సభ అభ్యర్ధులను గెలిపించి తీసుకువచ్చే బాధ్యత ఏ ఒక్కరిదో కాదని, అందరూ సమష్టిగా పార్టీ అభ్యర్ధుల విజయానికి కష్టపడాలని హితవు పలికినట్లు చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే భవిష్యత్ లో పదవులు ఉంటాయని రాహుల్ గాంధీ హెచ్చరించినట్లు సమాచారం.

First Published:  15 March 2019 9:47 PM GMT
Next Story