సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న బోల్డ్ బ్యూటీ

మొట్టమొదటి సినిమాతోనే హిట్ అందుకోవడం అంత సులువైన విషయం కాదు. కానీ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లోకి ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో అవకాశాలు రాలేదు.

ఈ మధ్యనే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో మెరుపు తీగలా మెరిసిన ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈమధ్య సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ వీడియో లలో ఒకటి ఈమె కూడా ట్రై చేసింది.

ఆ వీడియోలో బాత్రూంలో ఉన్న పాయల్…. ఫ్యాన్స్ ను కవ్విస్తూ తన టాప్ ను లేపబోయి మళ్లీ ఆగిపోయి కెమెరా వైపు చూస్తూ సిగ్గు పడుతుంది. “నువ్వు నన్ను అలా చూస్తే నా గుండె ఆగిపోతుంది” అంటూ హాట్ క్యాప్షన్ కూడా పోస్ట్ చేసింది పాయల్ రాజ్ పుత్.

‘ఆర్ఎక్స్ 100’ సినిమా లోనే కాక సోషల్ మీడియాలో సైతం పాయల్ రాజ్ పుత్ తన బోల్డ్ పర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ మతులు పోగొడుతుందన్నమాట.