Telugu Global
Cinema & Entertainment

తాప్సీ నన్ను ముద్దులు పెట్టి చంపేస్తుంది

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తాప్సి పన్ను తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత కొంతకాలంగా తెలుగులో కంటే హిందీ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న ఈమె ఇండస్ట్రీ లోనే బిజీ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఈమెకే కాకుండా సోషల్ మీడియాలో ఆమె సోదరి షాగున్ కి కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారు చాలా మందే ఉన్నారు. ఈ మధ్యనే […]

తాప్సీ నన్ను ముద్దులు పెట్టి చంపేస్తుంది
X

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తాప్సి పన్ను తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత కొంతకాలంగా తెలుగులో కంటే హిందీ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న ఈమె ఇండస్ట్రీ లోనే బిజీ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది.

ఈమెకే కాకుండా సోషల్ మీడియాలో ఆమె సోదరి షాగున్ కి కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారు చాలా మందే ఉన్నారు. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో తన సోదరి తాప్సి గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది.

“తాప్సీకి ఒక చెడ్డ అలవాటు కూడా ఉంది. నన్ను ఎప్పుడు వదలకుండా ముద్దులు పెట్టి చంపేస్తుంటుంది. అంతేకాక మోచేతితో గుద్దుతూ ఉంటుంది” అంటూ తాప్సి గురించి చెప్పింది.

ఇక షగున్ గురించి తాప్సీ మాట్లాడుతూ, “నా జీవితంలో బలం బలహీనత రెండూ అయిన షాగున్ అంటే నాకు చాలా ఇష్టం. తనే నా జీవితం. అందుకే ఆమెతో అలా ప్రవర్తిస్తూ ఉంటాను. కానీ ఆమెకు ఏమాత్రం చెడు జరుగుతుందని తెలిసినా నేను అసలు తట్టుకోలేను” అని చెప్పుకొచ్చింది.

అలా ఒకరిపై మరొకరు ప్రేమ ను చాటుకున్న షాగున్ మరియు తాప్సి వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే ఈవెంట్ మేనేజ్ మెంట్ బిజినెస్ ను కూడా చేస్తున్నారు.

First Published:  16 March 2019 4:54 AM GMT
Next Story