టీడీపీ అభ్యర్థిపై గన్‌మెన్‌ కాల్పులు

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కగ్గల్ లో కాల్పులు జరిగాయి. గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లగా టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని గ్రామస్తులు చుట్టుముట్టారు. దీంతో ప్రజలను భయపెట్టేందుకు గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో మిస్‌ ఫైర్ అయి.. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డికి గాయాలయ్యాయి. గన్‌మెన్ కాల్పుల్లో ఏఎస్‌ఐ కూడా గాయపడ్డారు. తన గన్‌మెన్ కాల్పుల్లో గాయపడ్డ తిక్కారెడ్డిని  ఆస్పత్రికి తీసుకెళ్లారు. తిక్కారెడ్డిపై జనం దాడి చేస్తారన్న అపోహతో గన్‌మెన్ కాల్పులు జరిపాడు. తిక్కారెడ్డి మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.