జగన్‌ ని తిట్టిన సతీష్‌ రెడ్డి…. చెప్పుతో కొడతానన్న వాసిరెడ్డి పద్మ

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో ఒక చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

జగన్‌ను వాడు వీడు అంటూ వ్యాఖ్యానించారు. జగన్‌ ఒక యూజ్‌లెస్‌ ఫెలో అని వ్యాఖ్యానించారు. వాడి గురించి నాకు బాగా తెలుసన్నారు. జగన్‌ అంత యూజ్‌లెస్‌ ఫెలోను, వెధవను ఎక్కడా చూడలేదన్నారు.

దీంతో వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. ”ఇష్టమొచ్చినట్టు మాట్లవద్దు. అసలు మీరు మనుషులేనా?. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చెప్పుతో కొడతా. అసలు మీరు మనుషులేనా. నెత్తురు తాగడానికి అలవాటు పడ్డారు. వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపిన వెధవలు మీరు. మళ్లీ మాట్లాడుతారా” అని వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు. వాసిరెడ్డి పద్మను కూడా సతీష్‌ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.