Telugu Global
Cinema & Entertainment

వైరల్ అవుతున్న 'డియర్ కామ్రేడ్' టీజర్

‘గీత గోవిందం’ సినిమా బ్లాక్ బస్టర్ కావడం వెనుక ముఖ్య కారణాల్లో ఒకటి ఆ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మధ్య కెమిస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వారిద్దరూ కలిసి ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ నాలుగు సౌత్ ఇండియన్ భాషల్లో విడుదలైంది. ఒక నిమిషం నిడివి గల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా […]

వైరల్ అవుతున్న డియర్ కామ్రేడ్ టీజర్
X

‘గీత గోవిందం’ సినిమా బ్లాక్ బస్టర్ కావడం వెనుక ముఖ్య కారణాల్లో ఒకటి ఆ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మధ్య కెమిస్ట్రీ అని చెప్పుకోవచ్చు.

ఇప్పుడు మళ్ళీ వారిద్దరూ కలిసి ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ నాలుగు సౌత్ ఇండియన్ భాషల్లో విడుదలైంది. ఒక నిమిషం నిడివి గల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘డియర్ కామ్రేడ్’ సినిమా ఎమోషనల్ డ్రామా గా ఉండబోతోందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ టీజర్ లో మొదట విజయ్ దేవరకొండ కాలేజీ లో ఒకరిని కొట్టడం చూపిస్తారు. తరువాత వెంటనే వర్షం లో రష్మీక ని ముద్దు పెడుతూ కనిపిస్తాడు విజయ్.

డైలాగులు ఏమీ లేకపోయినప్పటికీ, మ్యూజిక్ ఈ సినిమాకి కచ్చితంగా హై లైట్ అవుతుందని చెప్పచ్చు. మైత్రి మూవీ మేకర్స్ మరియు బిగ్ బెన్ సినిమా బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 31 న విడుదల కానుంది. ఈ సినిమా లో కూడా విజయ్ రష్మీక ల రొమాన్స్ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పచ్చు.

First Published:  17 March 2019 1:06 AM GMT
Next Story