కార్యకర్త మీద చేయేసి పొలిమేర దాటండి చూద్దాం….

టీడీపీ తిరిగి అధికారంలోకి రాగానే తొలి ఆరు నెలల పాటు స్వేచ్చ ఇస్తామని… ప్రత్యర్థులను చంపేసేయండి అంటూ ఇటీవల ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి చేసిన వ్యాఖ్యలపై ధర్మవరం వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన… ఒకడు పసుపు-కుంకుమ అంటాడు… మరొకడు కుంకుమ చెరిపేస్తానంటాడు అని మండిపడ్డారు. ఒక అబ్బకు పుట్టిన వాడు ఎవడైనా సరే వైసీపీ కార్యకర్తల మీద చేయేసి .. గ్రామ పొలిమేర్లు దాటి వెళ్లాలని వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు.

ఈ ఎన్నికల్లో వైసీపీకి వచ్చే మెజారిటీ చూసి భవిష్యత్తులో ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా భయపడే పరిస్థితి ఉంటుందన్నారు.