Telugu Global
NEWS

భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ ఖాళీ.. కారెక్కనున్న వనమా..!

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మరింత దూకుడుగా జరుగుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌లో సినియర్ నేతలే లేకుండా ఖాళీ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల ముందు ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ టార్గెట్ 16 సీట్లను కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కారెక్కడానికి నిర్ణయించుకున్నారు. దీంతో ఈ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్‌లోకి వెళ్లినట్లైంది. ఇప్పటికే పినపాక ఎమ్మెల్యే […]

భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ ఖాళీ.. కారెక్కనున్న వనమా..!
X

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మరింత దూకుడుగా జరుగుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌లో సినియర్ నేతలే లేకుండా ఖాళీ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల ముందు ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ టార్గెట్ 16 సీట్లను కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇక తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కారెక్కడానికి నిర్ణయించుకున్నారు. దీంతో ఈ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్‌లోకి వెళ్లినట్లైంది. ఇప్పటికే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ టీఆర్ ఎస్ లో చేరడానికి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

కాగా, వనమా వెంకటేశ్వర్లు టీఆర్ఎస్‌లో చేరడానికి గల కారణాలను వివరించారు. నియోజక వర్గ ప్రజలు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ మాట ఇచ్చినట్లు గానే జిల్లాను ఇచ్చారని.. సీతారామ ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మిస్తున్నారని.. దీని ద్వారా మంచి నీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.

ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బలమైన శక్తిని అందించారని.. వారి నిర్ణయాన్ని గౌరవించే పార్టీలో చేరుతున్నానని ఆయన స్పష్టం చేశారు.

First Published:  17 March 2019 9:44 AM GMT
Next Story