Telugu Global
NEWS

ఆల్ ది బెస్ట్ చెప్పిన మేకపాటి

మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్‌ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో చర్చకు తెరలేచింది. ఆదాలకు టికెట్ ఇస్తే మేకపాటి సహకరిస్తారా? అన్న చర్చ జరిగింది. ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి … మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇద్దరూ చాలా సేపు చర్చించుకున్నారు. ఆదాలకు మేకపాటి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. దాంతో ఆదాల అభ్యర్థిత్వానికి మేకపాటి మద్దతు కూడా లభించినట్టు భావిస్తున్నారు. పైగా మేకపాటి కుటుంబం నుంచి […]

ఆల్ ది బెస్ట్ చెప్పిన మేకపాటి
X

మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్‌ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో చర్చకు తెరలేచింది. ఆదాలకు టికెట్ ఇస్తే మేకపాటి సహకరిస్తారా? అన్న చర్చ జరిగింది.

ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి … మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇద్దరూ చాలా సేపు చర్చించుకున్నారు. ఆదాలకు మేకపాటి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. దాంతో ఆదాల అభ్యర్థిత్వానికి మేకపాటి మద్దతు కూడా లభించినట్టు భావిస్తున్నారు.

పైగా మేకపాటి కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లను జగన్ కేటాయించారు. ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్‌ను, ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు జగన్‌.

అదే సమయంలో పార్టీ మారినందుకు తనపై సోమిరెడ్డి చేసిన విమర్శలకు ఆదాల తీవ్రంగా స్పందించారు. 1999లోనే తాను మంత్రిని కావడంతో అప్పటి నుంచే సోమిరెడ్డి కడుపు మంట మొదలైందని.. ఆ కారణంగానే సోమిరెడ్డి బరువు 35 కేజీలకు పడిపోయారని ఆదాల ఎద్దేవా చేశారు.

నెల్లూరు జిల్లాలో మొత్తం 10 స్థానాల్లోనూ టీడీపీ ఓడిపోతుందని… అందుకు ప్రధాన కారణం సోమిరెడ్డే అవుతారని ఆదాల చెప్పారు. తాను వైసీపీలో చేరితే టీడీపీ వాళ్లు వారి సొమ్మును ఎత్తుకెళ్లినట్టుగా యాగీ చేస్తున్నారని ఆదాల విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఇంకా తనకు 50 కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉందన్నారు. వాటి కోసం కోర్టుకు కూడా వెళ్తానని చెప్పారు.

First Published:  17 March 2019 8:07 AM GMT
Next Story