Telugu Global
Cinema & Entertainment

నాగార్జున, నాగచైతన్య సినిమా ఫిక్స్

ప్రస్తుతం మామయ్య వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఇది ఓ కొలిక్కి వచ్చిన వెంటనే తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు ప్రాజెక్టుపైకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు చైతూ. అవును.. నాగ్-చైతూ కాంబోలో బంగార్రాజు సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి రాబోతోంది. నాగార్జున కోసం బంగార్రాజు ప్రాజెక్టును దాదాపు రెండేళ్లుగా చెక్కుతూనే ఉన్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఎట్టకేలకు సత్యానంద్ సహకారంతో ఈ సినిమా స్క్రీన్ ప్లే పూర్తిచేయగలిగాడు. ఫైనల్ నెరేషన్ విన్న […]

నాగార్జున, నాగచైతన్య సినిమా ఫిక్స్
X

ప్రస్తుతం మామయ్య వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఇది ఓ కొలిక్కి వచ్చిన వెంటనే తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు ప్రాజెక్టుపైకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు చైతూ. అవును.. నాగ్-చైతూ కాంబోలో బంగార్రాజు సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి రాబోతోంది.

నాగార్జున కోసం బంగార్రాజు ప్రాజెక్టును దాదాపు రెండేళ్లుగా చెక్కుతూనే ఉన్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఎట్టకేలకు సత్యానంద్ సహకారంతో ఈ సినిమా స్క్రీన్ ప్లే పూర్తిచేయగలిగాడు. ఫైనల్ నెరేషన్ విన్న నాగార్జున సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇందులో తాతగా నాగ్, మనవడిగా నాగచైతన్య నటించబోతున్నారనే విషయాన్ని గతంలోనే వార్తలొచ్చాయి.

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై సెట్స్ పైకి రాబోతోంది బంగార్రాజు సినిమా. కథ ఓకే అవ్వడంతో ఇప్పుడుస్టార్ కాస్ట్, టెక్నీషియన్స్ ఎంపికపై పడ్డాడు కల్యాణ కృష్ణ. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, నేలటిక్కెట్ సినిమాలో రవితేజ సరసన నటించిన మాళవిక శర్మను, నాగార్జున సరసన హీరోయిన్ గా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది.

First Published:  16 March 2019 8:52 PM GMT
Next Story