సెప్టెంబర్ లో విశాల్ పెళ్లి

నిన్ననే విశాల్-అనీషాల నిశ్చితార్థం పూర్తయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ వేడుకకు కేవలం విశాల్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కోలీవుడ్ నుంచి ఖుష్బూ మాత్రం వచ్చింది. నిశ్చితార్థం పూర్తవ్వడంతో పెళ్లికి తేదీ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ లో విశాల్-అనీష్ మూడుముళ్లతో ఒకటి కాబోతున్నారు.

తను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తను కూడా తన ప్రేమను అంగీకరించిందంటూ జనవరిలో ప్రకటించాడు విశాల్. తన పేరు ఆళ్ల అనీషారెడ్డి అని తెలిపిన విశాల్.. ఆమెతో దిగిన కొన్ని ఫొటోల్ని కూడా షేర్ చేశాడు. తాజాగా ఎంగేజ్ మెంట్ ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో పెట్టాడు.

మరోవైపు విశాల్ నటించిన అయోగ్య సినిమా వాయిదాపడింది. ఏప్రిల్ 19న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాకపోవడంతో మే 10కు వాయిదావేశారు. విశాల్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకుడు.