Telugu Global
NEWS

వైయస్సార్సీపి తొలి జాబితా... అన్ని వర్గాలకు ప్రాధాన్యం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. అధికార తెలుగుదేశం పార్టీలా కాకుండా బహిరంగ సభలోనూ, పాదయాత్ర సందర్భంగా ను పార్టీ అధ్యక్షుడిగా తాను ఏం చెప్పారో ఆ అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని ముందు నుంచి వైయస్ జగన్ ప్రకటిస్తూనే వచ్చారు. తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం తర్వాత కాసింత ఆందోళనతో కనిపించిన జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక […]

వైయస్సార్సీపి తొలి జాబితా... అన్ని వర్గాలకు ప్రాధాన్యం
X

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. అధికార తెలుగుదేశం పార్టీలా కాకుండా బహిరంగ సభలోనూ, పాదయాత్ర సందర్భంగా ను పార్టీ అధ్యక్షుడిగా తాను ఏం చెప్పారో ఆ అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని ముందు నుంచి వైయస్ జగన్ ప్రకటిస్తూనే వచ్చారు. తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం తర్వాత కాసింత ఆందోళనతో కనిపించిన జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక అంశంలో ఎలాంటి తత్తరపాటుకు గురి కాలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

తొలివిడతగా 25 లోక్ సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తొమ్మిది లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను పార్టీ నాయకులు వేమిరెడ్డి, జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు బీసీ వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు.

అమలాపురం లోక్ సభ ఎస్సీలకు కేటాయించడంతో అక్కడి నుంచి మహిళా నాయకురాలు చింతా అనురాధ ను వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అరకు ఎస్టీ నియోజకవర్గాన్ని కూడా మహిళకు కేటాయించడం పార్టీ వర్గాల్లో జోష్ పెంచింది. అరకు లోక్ సభ స్థానం నుంచి గొట్టాది మాధవి పోటీ చేయనున్నారు.

ఇక మిగిలిన వాటిలో నాలుగు స్థానాలను బీసీలకు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అలాగే 9 మంది అభ్యర్థులలో ఏడుగురు కొత్త వారే కావడం విశేషం. ఈ జాబితాతో అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు కలిగించే పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మిగిలిన స్థానాలను కూడా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  16 March 2019 8:34 PM GMT
Next Story