Telugu Global
NEWS

అభ్యర్ధుల ప్రకటనే విజయానికి నాంది అంటున్న పరిశీలకులు

ఆంధ్రప్రదేశ్ శాసన సభకు 175 మంది అభ్యర్ధులను, లోక్ సభకు 25 మంది అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ పై వ్యూహాత్మక విజయాన్ని సాధించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో ఏ పార్టీ కూడా ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించిన దాఖలాలు లేవంటున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒకేసారి 105 మంది అభ్యర్ధులను మాత్రమే ప్రకటించిందని, అధికారంలో ఉన్నా కాని అభ్యర్ధులందరినీ ఒకేసారి ప్రకటించే సాహసం చేయలేదని […]

అభ్యర్ధుల ప్రకటనే విజయానికి నాంది అంటున్న పరిశీలకులు
X

ఆంధ్రప్రదేశ్ శాసన సభకు 175 మంది అభ్యర్ధులను, లోక్ సభకు 25 మంది అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ పై వ్యూహాత్మక విజయాన్ని సాధించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

గతంలో ఏ పార్టీ కూడా ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించిన దాఖలాలు లేవంటున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒకేసారి 105 మంది అభ్యర్ధులను మాత్రమే ప్రకటించిందని, అధికారంలో ఉన్నా కాని అభ్యర్ధులందరినీ ఒకేసారి ప్రకటించే సాహసం చేయలేదని గుర్తు చేస్తున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్ధులలో బిసీలకు 45 సీట్లు ఇచ్చి సంచలనం రేపిందంటున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు ఇది సరైన సమాధానం అంటున్నారు. బీసీలతో పాటు మహిళలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి అభ్యర్దుల ఎంపికలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకున్నారంటున్నారు.

చివరి క్షణంలో పార్టీలో చేరిన సీనియర్ల మనసు నొప్పించకుండా వారికి తగిన రీతిలో గౌరవం కల్పిస్తామంటూ జగన్ చేసిన వాగ్దానం మంచి ఫలితాలు తీసుకు వస్తుందంటున్నారు.

సీనియర్ నాయకులు దాడి వీరబద్ర రావు, కిల్లి కృపారాణి, బొత్స ఝాన్సీ, రవీంద్రబాబు వంటి వారికి భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తామంటూ సముదాయించిన తీరుపై కూడా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందంటున్నారు. అమలాపురం సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అమలాపురంలో ఎప్పటి నుంచో టిక్కెట్టు ఆశిస్తున్న మహిళా నేతను నొప్పించడం సమంజసం కాదని చింతా అనురాధకు టిక్కెట్టు ఇచ్చారు జగన్. దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహ రచన చేసింది. రవీంద్రబాబు తిరిగి తెలుగుదేశం లోకి వస్తున్నారంటూ పచ్చ మీడియాలో కథనాలు రాయించారు.

వాటన్నింటిని తిప్పికొడుతూ రవీంద్ర బాబుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ జగన్ బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దిమ్మ తిరిగి సైకిల్ కనిపించిందంటున్నారు. పార్టీలో ఎవరినీ నొప్పించకుండా అభ్యర్ధులను ప్రకటించిన జగన్ రాజకీయ పరిణితికి ఇది నిదర్శనమంటున్నారు.

First Published:  18 March 2019 12:38 AM GMT
Next Story