Telugu Global
NEWS

టెస్ట్ క్రికెట్లో అప్ఘనిస్థాన్ సరికొత్త చరిత్ర

పసికూనగా రెండోటెస్టులోనే విజయం ఐర్లాండ్ పై నాలుగురోజుల్లోనే 7 వికెట్ల గెలుపు టెస్ట్ క్రికెట్ పసికూన, గత ఏడాదే ఐసీసీ నుంచి టెస్ట్ హోదా సంపాదించిన అప్ఘనిస్థాన్ కేవలం ఏడాది వ్యవధిలోనే తొలి టెస్ట్ విజయం నమోదు చేసింది. డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన ఐదురోజుల టెస్ట్ ..మొదటి నాలుగురోజుల ఆటలోనే ఐర్లాండ్ ను చిత్తు చేసింది. 147 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన అప్ఘనిస్థాన్ కు రెండో ఇన్నింగ్స్ లో […]

టెస్ట్ క్రికెట్లో అప్ఘనిస్థాన్ సరికొత్త చరిత్ర
X
  • పసికూనగా రెండోటెస్టులోనే విజయం
  • ఐర్లాండ్ పై నాలుగురోజుల్లోనే 7 వికెట్ల గెలుపు

టెస్ట్ క్రికెట్ పసికూన, గత ఏడాదే ఐసీసీ నుంచి టెస్ట్ హోదా సంపాదించిన అప్ఘనిస్థాన్ కేవలం ఏడాది వ్యవధిలోనే తొలి టెస్ట్ విజయం నమోదు చేసింది. డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన ఐదురోజుల టెస్ట్ ..మొదటి నాలుగురోజుల ఆటలోనే ఐర్లాండ్ ను చిత్తు చేసింది.

147 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన అప్ఘనిస్థాన్ కు రెండో ఇన్నింగ్స్ లో రహ్మత్ షా- ఇషానుల్లా జోడీ రెండో వికెట్ కు 139 పరుగుల భాగస్వామ్యంతో… 7 వికెట్ల విజయం అందించారు.

తొలిఇన్నింగ్స్ లో 98 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన రహ్మత్ షా రెండోఇన్నింగ్స్ లోనూ అజేయ హాఫ్ సెంచరీతో నిలిచాడు.

2017 సీజన్లో…ఐసీసీ నుంచి తొలిసారిగా టెస్ట్ హోదా పొందిన ఐర్లాండ్ తన అరంగేట్రం టెస్ట్ ను పాకిస్థాన్ తో ఆడి పరాజయం చవిచూసింది. మరోవైపు అప్ఘనిస్థాన్ తన అరంగేట్రం మ్యాచ్ ను టీమిండియాతో ఆడి చిత్తుగా ఓడింది.

రెండేళ్ల టెస్ట్ హోదా తర్వాత ఈరెండుజట్లు తలపడిన టెస్టులో అప్ఘనిస్తాన్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో రాణించడం ద్వారా…తొలి టెస్ట్ విజయం చవిచూసింది. అప్ఘన్ విజయంలో ప్రధానపాత్ర వహించిన వన్ డౌన్ ఆటగాడు రహ్మత్ షాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

First Published:  18 March 2019 9:09 AM GMT
Next Story