Telugu Global
Cinema & Entertainment

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు.... ఒక రోజంతా ప్రచారం ఇలా జరిగింది

దర్శకుడు రాం గోపాల్ వర్మ తన సినిమా విడుదల సమయంలో మాములుగా హడావిడి చేయడు. సినిమా కి క్రేజ్ తీసుకొని రావడానికి తనకి ఏది కావాలంటే అది చేస్తూ ఉంటాడు. ఎలా పడితే అలా మాట్లాడుతూ, టీవీ చానెల్స్ లో డిబేట్ లకు అటెండ్ అవుతాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకి సిద్ధం అవుతోంది. సాధారణంగా అయితే ఈ సినిమా ఈ నెల 22 న విడుదల కావాలి. అయితే నిన్న […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు.... ఒక రోజంతా ప్రచారం ఇలా జరిగింది
X

దర్శకుడు రాం గోపాల్ వర్మ తన సినిమా విడుదల సమయంలో మాములుగా హడావిడి చేయడు. సినిమా కి క్రేజ్ తీసుకొని రావడానికి తనకి ఏది కావాలంటే అది చేస్తూ ఉంటాడు. ఎలా పడితే అలా మాట్లాడుతూ, టీవీ చానెల్స్ లో డిబేట్ లకు అటెండ్ అవుతాడు.

ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకి సిద్ధం అవుతోంది. సాధారణంగా అయితే ఈ సినిమా ఈ నెల 22 న విడుదల కావాలి. అయితే నిన్న ఉదయం రాంగోపాల్ వర్మ స్టేట్ మెంట్ ఇస్తూ…. సెన్సార్ బోర్డ్ తన సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయాకే విడుదల చేయాలని చెప్పిందని ట్వీట్ చేశాడు.

అయితే ఇదంతా ఇంకో పబ్లిసిటీ స్టంట్ అని తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ మీద కోర్ట్ కేసు వేయడానికి సిద్ధం అయ్యాను అని ప్రకటించిన వర్మ…. సాయంత్రం లోపు ప్రెస్ మీట్ కూడా పెడుతున్నట్లు చెప్పాడు.

తీరా రాత్రి కాగానే, సెన్సార్ బోర్డ్ కి… తమ టీం కి మధ్య…. చిన్న మిస్ అండర్ స్టాండ్ వచ్చిందని, సమస్య సాల్వ్ అయ్యే దిశగా వెళ్తుందని, ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేస్తున్నా అని ప్రకటించాడు. చూడబోతే ఒక రోజు అంతా సినిమా కి కావాల్సిన ప్రచారం ఈ విధం గా చేసినట్లుగా చెబుతున్నారు.

First Published:  18 March 2019 12:04 AM GMT
Next Story