Telugu Global
Cinema & Entertainment

మొన్న అనిల్.... నిన్న పరశురాం....

సినిమా పరిశ్రమ లో ఏ దర్శకుడైనా…. అగ్ర హీరోలతో సినిమా చేయాలని భావిస్తూ ఉంటారు. కానీ అతి తక్కువ మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తన పంథా మార్చి…. పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ అని చూడకుండా ఎవరు మంచి కథ సిద్ధం చేసి తీసుకొని వస్తే, వాళ్ళతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అసలు అనిల్ రావిపూడి తో సినిమా చేస్తాడా? అని అంటుండగానే…. సడన్ గా […]

మొన్న అనిల్.... నిన్న పరశురాం....
X

సినిమా పరిశ్రమ లో ఏ దర్శకుడైనా…. అగ్ర హీరోలతో సినిమా చేయాలని భావిస్తూ ఉంటారు. కానీ అతి తక్కువ మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది.

తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తన పంథా మార్చి…. పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ అని చూడకుండా ఎవరు మంచి కథ సిద్ధం చేసి తీసుకొని వస్తే, వాళ్ళతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

అసలు అనిల్ రావిపూడి తో సినిమా చేస్తాడా? అని అంటుండగానే…. సడన్ గా ప్రాజెక్ట్ ఒకే చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అలానే మరో అనూహ్యమైన నిర్ణయం తీసుకొని మరో షాక్ ఇచ్చాడు.

సాధారణం గా స్టార్ డైరెక్టర్స్ తో మాత్రమే పని చేయడానికి సుముఖత చూపించే మహేష్ బాబు ఒక్కసారి గా ఇలా మారిపోయాడు ఇప్పుడు. ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ తో సినిమా చేసే అవకాశం ఉందట.

‘గీత గోవిందం’ విజయం తర్వాత గీతా ఆర్ట్స్ తో మరో సినిమాకి కమిట్ అయిన పరశురాం…. ఆ సినిమాకి సంబంధించిన కథ ని కూడా సిద్ధం చేశాడు. అల్లు అరవింద్ కూడా గత కొద్ది రోజులుగా మహేష్ బాబు తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే అరవింద్ చొరవ తీసుకొని మహేష్ కి దర్శకుడికి మీటింగ్ కూడా ఏర్పాటు చేసాడట. పరశురాం వినిపించిన స్టోరీ లైన్ నచ్చి వెంటనే స్క్రిప్ట్ కంప్లీట్ చేయమని, సినిమా చేస్తానని దర్శకుడికి మాట ఇచ్చాడట. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం తెలియాలి అంటే, మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

First Published:  17 March 2019 11:42 PM GMT
Next Story