Telugu Global
Cinema & Entertainment

బిగ్ బాస్ గా మారబోతున్న నాగ్

స్టార్ మా ఛానెల్ లో త్వరలోనే ప్రారంభంకానున్న బిగ్ బాస్ సీజన్-3పై మెల్లమెల్లగా ఇప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. పలువురు స్టార్స్ తో సంప్రదింపులు జరిగిన ఛానెల్, ఎట్టకేలకు ఆ దిశగా పురోగతి సాధించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగార్జున, సరికొత్త బిగ్ బాస్ గా బుల్లితెర వీక్షకుల్ని కనువిందు చేయబోతున్నాడు. నిజానికి బిగ్ బాస్ సీజన్-2లో మరోసారి ఎన్టీఆర్ ను రిపీట్ చేయాలనుకున్నారు. ఆల్రెడీ చేసిన కార్యక్రమం కావడం, పైగా రెమ్యూనరేషన్ కూడా బ్రహ్మాండంగా ఉండడంతో […]

బిగ్ బాస్ గా మారబోతున్న నాగ్
X

స్టార్ మా ఛానెల్ లో త్వరలోనే ప్రారంభంకానున్న బిగ్ బాస్ సీజన్-3పై మెల్లమెల్లగా ఇప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. పలువురు స్టార్స్ తో సంప్రదింపులు జరిగిన ఛానెల్, ఎట్టకేలకు ఆ దిశగా పురోగతి సాధించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగార్జున, సరికొత్త బిగ్ బాస్ గా బుల్లితెర వీక్షకుల్ని కనువిందు చేయబోతున్నాడు.

నిజానికి బిగ్ బాస్ సీజన్-2లో మరోసారి ఎన్టీఆర్ ను రిపీట్ చేయాలనుకున్నారు. ఆల్రెడీ చేసిన కార్యక్రమం కావడం, పైగా రెమ్యూనరేషన్ కూడా బ్రహ్మాండంగా ఉండడంతో తారక్ కూడా ఓకే అనేశాడు. కానీ అనుకోకుండా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పడింది. ఏడాది పాటు బల్క్ కాల్షీట్లు అడిగాడు రాజమౌళి. దీంతో మరో కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్టీఆర్ కు అవకాశం లేకుండా పోయింది.

ఎన్టీఆర్ తర్వాత నానిని కూడా సంప్రదించారు ఛానెల్ ప్రతినిధులు. కానీ రెండు కారణాల వల్ల నాని వద్దనుకున్నాడు. ఒకటి ప్రస్తుతం బిగ్ బాస్ చేయడానికి నాని వద్ద టైమ్ లేదు. ఇక రెండోది నెట్ లో అతడిపై జరిగిన ట్రోలింగ్. మరోసారి బిగ్ బాస్ చేసి ట్రోలింగ్ కు గురవ్వడం నానికి ఇష్టంలేదు. అందుకే తప్పుకున్నాడు.

వీళ్లిద్దరూ తప్పుకోవడంతో ఇప్పుడా ఛాన్స్ నాగార్జును వరించింది. నాగ్ కూడా ఖాళీగా లేడు. ప్రస్తుతం రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు. కాకపోతే ఆ రెండూ తన సొంత సినిమాలే. పైగా నాగ్ కు బుల్లితెర కొత్త కాదు. అందుకే బిగ్ బాస్ సీజన్-3 చేయడానికి ఒప్పుకున్నాడట.

First Published:  18 March 2019 9:23 AM GMT
Next Story