Telugu Global
Cinema & Entertainment

ఎవరూ దొరక్క రకుల్ ని తీసుకుంటున్నారా?

రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర స్థానం లో దూసుకుపోతున్న హీరోయిన్ లలో ఒకరు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న రకుల్…. ఇండస్ట్రీ లో అనతి కాలం లోనే అగ్ర హీరోల సరసన మెరిసి స్టార్ డమ్ తెచ్చుకుంది. ఇటు తెలుగులో పాటు అటు తమిళ్ లో కూడా వరుస సినిమాలు చేసింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా…. విజయాలు వస్తేనే అంతా సాఫీ గా సాగుతున్నట్టు లెక్క. కానీ ఈ మధ్య కాలం […]

ఎవరూ దొరక్క రకుల్ ని తీసుకుంటున్నారా?
X

రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర స్థానం లో దూసుకుపోతున్న హీరోయిన్ లలో ఒకరు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న రకుల్…. ఇండస్ట్రీ లో అనతి కాలం లోనే అగ్ర హీరోల సరసన మెరిసి స్టార్ డమ్ తెచ్చుకుంది.

ఇటు తెలుగులో పాటు అటు తమిళ్ లో కూడా వరుస సినిమాలు చేసింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా…. విజయాలు వస్తేనే అంతా సాఫీ గా సాగుతున్నట్టు లెక్క. కానీ ఈ మధ్య కాలం లో ఈ అమ్మడికి అంతటి విజయాలేమి లేవు. పెద్దగా సినిమా లు కూడా ఈ మధ్య బాగా ఆడలేదు.

అందుకేనేమో, వేరే హీరోయిన్లు ఎవరూ దొరక్క పోయినా, వారి డేట్లు సెట్ కాకపోయినా, దర్శక నిర్మాతలు రకుల్ ని అప్రోచ్ అవుతున్నారట.

ఇటీవలే, సాయి ధరం తేజ్ తదుపరి చిత్రం కోసం రకుల్ ని అప్రోచ్ అయ్యారట. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించనున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన విన్నర్ సినిమా లో ఈ జోడి ఇంతకు ముందు మెరిసింది. ఇప్పుడు మళ్ళీ ఇరువురు కలిసి నటించనున్నారు.

అయితే వీరిద్దరి కాంబినేషన్ ఒకసారి ఫ్లాప్ అయింది. మరి ఈసారైనా ఈ జంట విజయం సాదిస్తుందో లేదో చూడాలి.

First Published:  18 March 2019 12:16 AM GMT
Next Story