ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్‌ – టైమ్స్ నౌ

ఏపీలో వైసీపీ ప్రభంజనం తప్పదంటోంది మరో సర్వే. ఇటీవల ఇండియా టీవీ సర్వే వైసీపీకి 22 ఎంపీ సీట్లు టీడీపీకి మూడు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది.

తాజాగా సోమవారం టైమ్స్ నౌ చానల్‌ కూడా సర్వే ప్రసారం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. టైమ్స్ నౌ- వీఎంఆర్‌ సర్వే ప్రకారం ఏపీలో వైసీపీ విజయదుందుబి మోగించనుంది. ఏకంగా 22 ఎంపీ సీట్లను వైసీపీ సొంతం చేసుకోనుంది. టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితం కానుంది.

వైసీపీకి 48. 8 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. టీడీపీకి 38.4 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. దాదాపు పది శాతం ఓట్ల తేడా రెండు పార్టీల మధ్య ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు గత ఎన్నికలతో పోలిస్తే మరింత తగ్గింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2.8 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్‌కు 2.2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. గత ఎన్నికల్లో బీజేపీకి 7. 2 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు బీజేపీకి కేవలం 5.8 శాతం ఓట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే వివరించింది.

అటు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఏకంగా 13 స్థానాలను సొంతం చేసుకోనుంది. కాంగ్రెస్, ఎంఐఎంలు చెరో స్థానం సాధిస్తాయని టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే వెల్లడించింది. బీజేపీకి తెలంగాణలో రెండు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. మొత్తం మీద ఏపీలో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే వెల్లడించింది. ఈనెలలోనే ఈ సర్వే నిర్వహించారు.