మరోసారి తెలుగుతెరపైకి వేదిక

వేదిక.. సడెన్ గా ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు గుర్తురాదు. విజయ దశమి, బాణం, దగ్గరగా దూరంగా లాంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ అంటే అప్పుడు మెల్లమెల్లగా గుర్తొస్తుంది. ఆ 3 సినిమాల తర్వాత పూర్తిగా టాలీవుడ్ కు టాటా చెప్పేసిన ఈ బ్యూటీ, ఎట్టకేలకు మరో తెలుగు సినిమాకు కమిట్ అయింది. ఆ మూవీ కూడా ఈరోజు లాంఛ్ అయింది

ఆది సాయికుమార్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ గా వేదికను తీసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి వేదిక కూడా హాజరై సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు కార్తీక్ విఘ్నేష్ దర్శకుడు. వేదికకు ఇది నాలుగో తెలుగు సినిమా.

ఈనెల 25 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ ను చిత్తూరు జిల్లా తలకోనలో ప్లాన్ చేశారు. అర్జున్ సురవరం చిత్రాన్ని నిర్మించిన ఎంవీ ఆరా సినిమాస్ బ్యానర్ పై ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వస్తోంది. మూవీ జానర్ ఏంటనే విషయాన్ని మేకర్స్ సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఈ సినిమా సక్సెస్ తోనైనా వేదిక తెలుగులో క్లిక్ అవుతుందేమో చూడాలి.