Telugu Global
Cinema & Entertainment

అజయ్ తో.... కీర్తిసురేష్ !

ఇప్పటికే మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్ తెరంగేట్రం గురించి అనేక వార్తలు వచ్చాయి. కీర్తి సురేష్ ఇంకా అధికారికంగా ఈ సినిమా పై ఒక ప్రకటన ఇవ్వక పోయినా, శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ తన తండ్రి కీర్తి ని హిందీ లో లాంచ్ చేస్తున్నాడని, అందుకు తానెంతో సంతోషంతో ఉన్నాను అని చెప్పేసింది. అయితే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. ఇండియన్ ఫుట్ బాల్ టీం కి ఒకప్పుడు కోచ్ గా పనిచేసిన […]

అజయ్ తో.... కీర్తిసురేష్ !
X

ఇప్పటికే మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్ తెరంగేట్రం గురించి అనేక వార్తలు వచ్చాయి. కీర్తి సురేష్ ఇంకా అధికారికంగా ఈ సినిమా పై ఒక ప్రకటన ఇవ్వక పోయినా, శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ తన తండ్రి కీర్తి ని హిందీ లో లాంచ్ చేస్తున్నాడని, అందుకు తానెంతో సంతోషంతో ఉన్నాను అని చెప్పేసింది.

అయితే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. ఇండియన్ ఫుట్ బాల్ టీం కి ఒకప్పుడు కోచ్ గా పనిచేసిన ఒక వ్యక్తి చుట్టూ ఈ సినిమా కథ రాసుకున్నారట. అయితే కీర్తి సురేష్ ఈ సినిమా లో ప్రధాన పాత్ర పోషిస్తున్నా కానీ, ఈ సినిమాలో ఒక మెయిన్ స్ట్రీం హిందీ నటుడు కీర్తి తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తల ప్రకారం, ఈ సినిమా లో ఆర్ఆర్ఆర్ తో… తెలుగు లో అరంగేట్రం ఇవ్వనున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. ఇంకా పేరు ఖరారు చెయ్యని ఈ హిందీ చిత్రం…. కీర్తితో అజయ్ బాలీవుడ్ అడుగులు వేయించనున్నాడు అని మాత్రం తెలుస్తోంది.

First Published:  18 March 2019 11:40 PM GMT
Next Story