Telugu Global
Cinema & Entertainment

స్క్రిప్ట్ రెడీ.... త్వరలోనే ఓపెనింగ్

అనీల్ రావిపూడి, మహేష్ కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇది. ఈ మూవీకి సంబంధించి కంప్లీట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశాడు దర్శకుడు. దానికి మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. అనీల్ రావిపూడి స్టయిల్ లో కామెడీ, యాక్షన్ మిక్స్ చేస్తూ ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు కాస్టింగ్ ఫిక్స్ చేసే పనిలో ఉన్న అనీల్ రావిపూడి, మహేష్ తో సినిమా ఓకే అయిందనే విషయాన్ని పరోక్షంగా స్పష్టంచేశాడు. నిజానికి […]

స్క్రిప్ట్ రెడీ.... త్వరలోనే ఓపెనింగ్
X

అనీల్ రావిపూడి, మహేష్ కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇది. ఈ మూవీకి సంబంధించి కంప్లీట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశాడు దర్శకుడు. దానికి మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. అనీల్ రావిపూడి స్టయిల్ లో కామెడీ, యాక్షన్ మిక్స్ చేస్తూ ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు కాస్టింగ్ ఫిక్స్ చేసే పనిలో ఉన్న అనీల్ రావిపూడి, మహేష్ తో సినిమా ఓకే అయిందనే విషయాన్ని పరోక్షంగా స్పష్టంచేశాడు.

నిజానికి మహేష్-అనీల్ రావిపూడి సినిమా ఫిక్స్ అయిందనే విషయాన్ని నిర్మాత అనీల్ సుంకర వెల్లడించాడు. సూపర్ అనే అర్థం వచ్చేలా ఓ సింబల్, స్టార్ సింబర్ పక్కపక్కనపెట్టి, సినిమా ఓకే అయిందంటూ పరోక్షంగా వెల్లడించాడు. ఇప్పుడు అవే సింబల్స్ ను అనీల్ రావిపూడి కూడా వాడి మేటర్ పక్కా చేశాడు. కంప్లీట్ నెరేషన్ ఓకే అయిపోవడంతో, అనీల్ రావిపూడి కూడా ఇలా బయటపడ్డాడు.

ఈ సినిమాలో రెండు కీలక పాత్రల కోసం విజయశాంతి, ఉపేంద్రలను ట్రై చేస్తున్నారు. విజయశాంతి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఉపేంద్ర మాత్రం కథ వినడానికి అంగీకరించాడు. ఈ విషయాన్ని అతడే ఆమధ్య స్వయంగా వెల్లడించాడు. జులై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

First Published:  18 March 2019 9:20 PM GMT
Next Story