Telugu Global
NEWS

ఎన్నికల ఆదాయం పై కన్నేసిన స్టార్ స్పోర్ట్స్....

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాయకులు ఎన్నికల కోలాహాలంలో మునిగిపోయారు. తొలి విడత లోక్‌సభ ఎన్నికలకు మరో 20 రోజులే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఒకవైపు అభ్యర్థులు తమ సొంత ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో అప్పుడే ప్రచారం కూడా స్టార్ట్ చేశాయి. ఇక దేశంలో ఎన్నికల కోలాహాలంతో పాటు ఐపీఎల్ కూడా మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. […]

ఎన్నికల ఆదాయం పై కన్నేసిన స్టార్ స్పోర్ట్స్....
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాయకులు ఎన్నికల కోలాహాలంలో మునిగిపోయారు. తొలి విడత లోక్‌సభ ఎన్నికలకు మరో 20 రోజులే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఒకవైపు అభ్యర్థులు తమ సొంత ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో అప్పుడే ప్రచారం కూడా స్టార్ట్ చేశాయి.

ఇక దేశంలో ఎన్నికల కోలాహాలంతో పాటు ఐపీఎల్ కూడా మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఎన్నికలతో పాటే ఐపీఎల్ జరుగుతుండటంతో ఆ టోర్నీ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ పెద్ద ప్రణాళిక రచించింది. ప్రస్తుత సీజన్‌లో న్యూస్ ఛానల్స్ కంటే స్పోర్ట్స్ ఛానల్స్ చూసే వాళ్లే ఎక్కువ. దాంతో రాజకీయ పార్టీల యాడ్స్‌ను కూడా ప్రసారం చేస్తే ఎక్కువ రెవెన్యూ సంపాదించవచ్చని భావించింది.

మిగతా ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్ ఛానల్స్ కంటే స్పోర్ట్స్ ఛానల్స్‌లో టారిఫ్‌లు ఎక్కువ. అయినా రాజకీయ పార్టీలు కచ్చితంగా వ్యూవర్స్ ఎక్కువగా ఉండే ఈ ఛానల్స్‌కు యాడ్స్ ఇస్తాయని భావించింది. వెంటనే తమ ప్రతిపాదనను బీసీసీఐ ముందు ఉంచింది.

అయితే బీసీసీఐ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. రాజకీయ పార్టీల యాడ్స్‌ను ఐపీఎల్ మధ్యలో వేయడం తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందని సీవోఏ తేల్చి చెప్పింది. మరోవైపు స్టార్‌స్పోర్ట్స్ యాడ్స్ ఎన్ని వేసుకున్నా బీసీసీఐకి వచ్చే అదనపు ప్రయోజనం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రసార హక్కులను ఒక రేటుకు అమ్మేసింది. దీంతో స్టార్ స్పోర్ట్స్ తమ ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

First Published:  19 March 2019 12:52 AM GMT
Next Story