Telugu Global
NEWS

జాతీయ మీడియా సర్వేలను ఆపలేమా : చంద్రబాబు

“అంతా మన చెప్పుచేతల్లో ఉండాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ జాతీయ మీడియా సర్వేలు రావడం ఏమిటి? దీనిని కట్టుదిట్టం చేయాలి. కనీసం ఈ మీడియా సర్వేలను స్థానిక పత్రికల్లోనూ… ఛానళ్ళలోనూ రాకుండా చూడాలి” ఇవీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సరికొత్త ఆదేశాలు అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న మీడియా తాము చెప్పినట్లుగానే వింటున్నాయని, జాతీయ మీడియా మాత్రం తమ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు […]

జాతీయ మీడియా సర్వేలను ఆపలేమా : చంద్రబాబు
X

“అంతా మన చెప్పుచేతల్లో ఉండాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ జాతీయ మీడియా సర్వేలు రావడం ఏమిటి? దీనిని కట్టుదిట్టం చేయాలి. కనీసం ఈ మీడియా సర్వేలను స్థానిక పత్రికల్లోనూ… ఛానళ్ళలోనూ రాకుండా చూడాలి” ఇవీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సరికొత్త ఆదేశాలు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఉన్న మీడియా తాము చెప్పినట్లుగానే వింటున్నాయని, జాతీయ మీడియా మాత్రం తమ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా టైమ్స్ నౌ నిర్వహించిన ఒక సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జరిగే లోక్ సభ ఎన్నికలలో ఇరవై రెండు స్థానాలను కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. అధికార తెలుగుదేశం పార్టీకి మూడు స్థానాలు దక్కుతాయని టైమ్స్ నౌ ఆ సర్వేలో పేర్కొంది.

ఈ సర్వే వివరాలు తెలుగు చానళ్లలో ప్రసారం కావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి గురైనట్లు చెబుతున్నారు.

ఎన్నికలకు ఇక ఇరవై రోజులు మాత్రమే గడువు ఉందని, జాతీయ మీడియా సర్వే పేరుతో వాస్తవాలను వెల్లడిస్తూ తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల పాలు చేస్తోందని చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నాయకుల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో ఉన్న మీడియా…. జాతీయ మీడియా ఇస్తున్న సర్వే ఫలితాలను ప్రకటించకుండా చూడాలని, తప్పనిసరి పరిస్థితులలో ప్రచురించాల్సి వస్తే మరో సర్వే అంటూ దీనికి భిన్నంగా ప్రకటనలు వచ్చేలా చూడాలని సీనియర్లకు సూచించినట్లు సమాచారం.

జాతీయ మీడియా సర్వే కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తిని పెంచుకునే అవకాశం ఉందని, జాతీయ మీడియా నిర్వహిస్తున్న సర్వేలలో వాస్తవాలు ఉన్నప్పటికీ అవి ప్రజలకు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది పార్టీ సీనియర్ నాయకులేనని చంద్రబాబు అన్నట్లు చెబుతున్నారు.

జాతీయ మీడియాలో తనకున్న పరిచయాలతో కొంత వరకు వాటిని నిలువరించగలనని, అయితే పూర్తి స్థాయిలో వాటిని ఎదుర్కోవాలంటే స్థానికంగా ఉన్న తమ మీడియాను ఉపయోగించుకోవాలని సీనియర్ నాయకులకు చంద్రబాబు నాయుడు సూచించినట్లు చెబుతున్నారు.

First Published:  18 March 2019 9:02 PM GMT
Next Story