తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్.. కమలం గూటికి డీకే అరుణ..?

ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ తగులుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు మరో పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిశ్చయించుకున్నారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానాన్ని ఆమె ఆశించారు. కాని అధిష్టానం ఆ టికెట్‌ను వంశీచంద్ రెడ్డికి ఇచ్చింది. మొన్నటి అసెంబ్లీలో ఓడిన పలువురికి టికెట్ ఇచ్చి తనకు నిరాకరించడంపై ఆమె మనస్తాపం చెందినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

దీంతో ఎలాగైనా ఈ సారి మహబూబ్‌నగర్ నుంచి నిలబడాలనే పట్టుదలతో ఉన్నారు. విషయం తెలిసి రాంమాదవ్ వాళ్ళ ఇంటికి వెళ్లి కలిసి చర్చించాడు. వెంటనే ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ సీనియర్ నాయకులను కలిసి చర్చలు జరిపారు. పార్టీలోకి వస్తానని.. అయితే తనకు పాలమూరు టికెట్ కావాలని చెప్పారు. దాదాపు అరగంటకు పైగా వీరి సమావేశం జరిగింది.

రేపు ఉదయం లోపు డీకే అరుణకు బీజేపీ టికెట్ విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది. ఒక వేళ బీజేపీ డీకే అరుణ డిమాండ్‌కు ఒప్పుకుంటే రేపే ఆమె కమలం కండువా కప్పుకోవడం ఖాయమని ఢిల్లీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.