Telugu Global
International

భౌతిక శాస్త్ర గమనాన్నే మార్చిన సాపేక్ష సిద్దాంతం ప్రతిపాదించింది ఐన్‌స్టీన్ కాదా..?

చరిత్ర కొన్ని విషయాలను పట్టించుకోదు. కాని అవి ఎంత అమూల్యమైనవో భవిష్యత్ తరాలకు తెలిస్తే కాని అర్థం కాదు. ఒకరిని చిన్న చూపు చూడటం వల్ల.. వారికి రావల్సినంత పేరు రాదు.. లేదా ఆ పేరు మరొకరికి రావొచ్చు. అవి మనకు చిన్నవే కావొచ్చు కాని ప్రతిభ మరుగున వ్యక్తి అనుభవించే బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. చరిత్ర మరిచిన ఒక వ్యక్తి గురించే..! ఈ విషయం ఇప్పుడు ప్రపంచాన్నే మరో సారి వెనకకు తిరిగి […]

భౌతిక శాస్త్ర గమనాన్నే మార్చిన సాపేక్ష సిద్దాంతం ప్రతిపాదించింది ఐన్‌స్టీన్ కాదా..?
X

చరిత్ర కొన్ని విషయాలను పట్టించుకోదు. కాని అవి ఎంత అమూల్యమైనవో భవిష్యత్ తరాలకు తెలిస్తే కాని అర్థం కాదు. ఒకరిని చిన్న చూపు చూడటం వల్ల.. వారికి రావల్సినంత పేరు రాదు.. లేదా ఆ పేరు మరొకరికి రావొచ్చు. అవి మనకు చిన్నవే కావొచ్చు కాని ప్రతిభ మరుగున వ్యక్తి అనుభవించే బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. చరిత్ర మరిచిన ఒక వ్యక్తి గురించే..! ఈ విషయం ఇప్పుడు ప్రపంచాన్నే మరో సారి వెనకకు తిరిగి చూసేలా చేస్తోంది.

భౌతిక శాస్త్రానికి మూలస్తంభం వంటి సిద్దాంతాల్లో సాపేక్ష సిద్దాంతం (Theory of Relativity) ఒకటి. దీన్ని ప్రతిపాదించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఒక విషయం వెలుగులోనికి వచ్చింది. ఈ సాపేక్ష సిద్దాంతాన్ని ప్రతిపాదించింది ఐన్‌స్టీన్ మొదటి భార్య మిలెవా మారిక్ అంటా. ఆ సిద్దాంతంలో అత్యధిక భాగాన్ని ఆమే ప్రతిపాదించినట్లు “ఐన్‌స్టీన్స్ వైఫ్ : ది రియల్ స్టోరీ ఆఫ్ మిలేవా ఐన్‌స్టీన్ మారిక్” అనే పుస్తకంలో పేర్కొన్నారు.

22 ఫిబ్రవరి 2019లో ఈ పుస్తకం విడుదలైంది. దీన్ని ప్రొఫెసర్ డేవిడ్ సి. కాసిడీ, బ్రిటిష్ గణిత – భౌతిక శాస్త్ర అధ్యాపకుడు అల్లెన్ ఎస్టర్‌సన్‌లు సైన్స్ చరిత్రకారిణి రూత్ లూయిన్‌తో కలసి రచించారు. ఇందులో ఐన్‌స్టీన్ భార్యగా మిలెవా కోల్పోయిన జీవితం గురించి వివరించారు. తన భర్త పేరు ప్రఖ్యాతుల నీడలో తను ఎలా మరుగున పడిందో చెప్పారు.

20వ శతాబ్దం తొలి నాళ్లలో ఆడవాళ్లు బయటకు వచ్చి చదువు కోవడమే పెద్ద అద్భుతం. అలాంటిది మిలెవా గణితం, భౌతిక శాస్త్రాల్లో నిష్ణాతురాలైంది. వాటిల్లో ఎన్నో పరిశోధనలు చేసింది. కాని ఐన్‌స్టీన్‌తో పెళ్లి.. సంసారం.. పిల్లలు వంటి చట్రంలో పడిపోయి తన పరిశోధనలను కొనసాగించలేక పోయిందని వాళ్లు వివరించారు. అయితే భర్త సాపేక్ష సిద్దాంతంపై ప్రయోగాలు చేసే సమయంలో తాను కూడా ఎంతో సహాయం చేసిందని.. ఆ సిద్దాంతంలో అత్యధిక భాగం మిలెవానే ప్రతిపాదించిందని రచయితలు పేర్కొన్నారు.

ఆమెకు సరైన అవకాశాలు రాలేదని.. ఒక వేళ వచ్చుంటే భౌతిక శాస్త్రాన్నే మార్చేయగల శక్తిసామర్థ్యాలు ఆమెకు ఉన్నాయని చెప్పారు. ఐన్‌స్టీన్‌కు వచ్చిన పేరు ప్రఖ్యాతుల్లో ఆమె సహాయం ఎంతో ఉందని ఆ పుస్తకం చెబుతోంది.

ఒక యువతి తన కలలను సాకారం చేసుకునే క్రమంలో ఎన్నో కారణాల చేత మరుగున పడిపోయి సంసార జీవితం కోసం కెరీర్‌ని త్యాగం చేసిందని వారు ఆ పుస్తకంలో మిలెవా గురించి పేర్కొన్నారు.

First Published:  19 March 2019 2:29 AM GMT
Next Story