క‌ర్నూలు నుంచి క‌నిగిరికి మారిన కథ !

క‌ర్నూలు జిల్లాలో అస్త్ర స‌న్యాసాలు ముగిశాయి. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాలో మొద‌ల‌య్యే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. క‌నిగిరి టీడీపీ టికెట్ విషయంలో మ‌ళ్లీ వివాదం మొద‌లైంది.

క‌నిగిరి టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే ఉగ్ర న‌ర‌సింహారెడ్డికి కేటాయించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే క‌దిరి బాబురావు మ‌న‌స్తాపం చెందారు. త‌న‌కు ద‌ర్శి టికెట్ కేటాయించ‌డంపై అల‌క వ‌హించారు.

స్వ‌గ్రామం శీలంవారిప‌ల్లిలో అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిస్తున్నారు. సాయంత్రం లోపు ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ద‌ర్శి నుంచి క‌దిరి బాబూరావు పోటీ చేసేది డౌట్ అనే వార్త‌లు విన్పిస్తున్నాయి. మొత్తానికి ప్ర‌కాశం జిల్లాలో కూడా నామినేష‌న్ల‌కు ముందే పోటీ నుంచి తప్పుకునే నేత‌లే క‌న్పిస్తున్నారు.