Telugu Global
Cinema & Entertainment

షాకింగ్... కాంచన-3కి 12 కోట్లు

మొన్నటికి మొన్న కల్యాణ్ రామ్ సినిమా 9 కోట్లు బిజినెస్ చేసింది. ఆ సినిమా కల్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ మూవీగా నిలిచింది. ఎందుకంటే అది బ్రేక్-ఈవెన్ అయింది. మరి పెద్దగా క్రేజ్ లేని కాంచన-3కి 15 కోట్లు వస్తాయా? ప్రస్తుతం ఇదే ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అవును.. కాంచన-3 సినిమాను 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు నిర్మాత ఠాగూర్ మధు. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి […]

షాకింగ్... కాంచన-3కి 12 కోట్లు
X

మొన్నటికి మొన్న కల్యాణ్ రామ్ సినిమా 9 కోట్లు బిజినెస్ చేసింది. ఆ సినిమా కల్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ మూవీగా నిలిచింది. ఎందుకంటే అది బ్రేక్-ఈవెన్ అయింది. మరి పెద్దగా క్రేజ్ లేని కాంచన-3కి 15 కోట్లు వస్తాయా? ప్రస్తుతం ఇదే ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

అవును.. కాంచన-3 సినిమాను 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు నిర్మాత ఠాగూర్ మధు. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి ఇంత మొత్తం చెల్లించాడట ఠాగూర్ మధు. లారెన్స్ సినిమాకు ఇంత మొత్తమంటే చాలా ఎక్కువ. ప్రమోషన్స్ ఖర్చుతో కలుపుకొని బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 15 కోట్లు రావాలి.

అంత మొత్తం వస్తుందా అనేది ప్రస్తుతానికి డౌట్. కాకపోతే లారెన్స్ కు ఇక్కడ మార్కెట్ లేకపోయినా.. కాంచన-3కి మాత్రం కాస్త క్రేజ్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ముని, కాంచన-2 సినిమాలు రెండూ హిట్ అయ్యాయి. కాబట్టి ఆ క్రేజ్ఈ సీక్వెల్ కు వర్కవుట్ అవుతుందేమో చూడాలి.

First Published:  19 March 2019 8:10 AM GMT
Next Story