Telugu Global
NEWS

పాదాభివందనం చేసినా.... హర్షకుమార్‌కు మొండిచేయి...

పెండింగ్‌ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. భీమిలి సీటును మాజీ ఎంపీ సబ్బంహరికి కేటాయించారు. జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరికలను చంద్రబాబు లెక్కచేయలేదు. అన్ని ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల ఎంపీ సీటు హామీతో మాజీ ఎంపీ హర్షకుమార్‌ టీడీపీలో చేరారు. టీడీపీలో చేరడానికి కొన్ని రోజుల ముందు హర్షకుమార్ చంద్రబాబు మెప్పు పొందేందుకు జగన్‌పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. టీడీపీ కండువా కప్పుకునే సమయంలో చంద్రబాబుకు హర్షకుమార్ పాదాభివందనం కూడా చేశారు. అయితే చంద్రబాబు ప్రకటించిన జాబితాలో హర్షకుమార్‌కు సీటు రాలేదు. అమలాపురం […]

పాదాభివందనం చేసినా.... హర్షకుమార్‌కు మొండిచేయి...
X

పెండింగ్‌ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. భీమిలి సీటును మాజీ ఎంపీ సబ్బంహరికి కేటాయించారు. జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరికలను చంద్రబాబు లెక్కచేయలేదు. అన్ని ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల ఎంపీ సీటు హామీతో మాజీ ఎంపీ హర్షకుమార్‌ టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరడానికి కొన్ని రోజుల ముందు హర్షకుమార్ చంద్రబాబు మెప్పు పొందేందుకు జగన్‌పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. టీడీపీ కండువా కప్పుకునే సమయంలో చంద్రబాబుకు హర్షకుమార్ పాదాభివందనం కూడా చేశారు. అయితే చంద్రబాబు ప్రకటించిన జాబితాలో హర్షకుమార్‌కు సీటు రాలేదు.

అమలాపురం ఎంపీ సీటును గంటి హరీష్‌కు కేటాయించారు. నరసరావుపేట సీటు తిరిగి రాయపాటికే కేటాయించారు. రాజమండ్రి సీటు మురళీమోహన్ కోడలు రూపకు ఇచ్చారు. విశాఖ సీటు బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌కు ఎట్టకేలకు ఇచ్చారు.

జేసీ వ్యతిరేకించినప్పటికీ అనంతపురం అర్బన్ స్థానం ప్రభాకర్‌ చౌదరికే ఇచ్చారు. గుంతకల్లు సీటు కూడా జేసీ మనిషి మదుసూధన గుప్తకు ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌కే ఇచ్చారు.

First Published:  18 March 2019 9:45 PM GMT
Next Story