Telugu Global
Cinema & Entertainment

'సైరా'లో ఆ డైలాగ్స్.... సినిమాకే హైలైట్ అంట!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన తొలితరం యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. బ్రిటిష్ వారికి చుక్కలు చూపించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి చివరికి ఉరిశిక్ష విధించారన్న సంగతి విధితమే. అయితే తాజా సమాచారం ప్రకారం […]

సైరాలో ఆ డైలాగ్స్.... సినిమాకే హైలైట్ అంట!
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన తొలితరం యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. బ్రిటిష్ వారికి చుక్కలు చూపించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి చివరికి ఉరిశిక్ష విధించారన్న సంగతి విధితమే.

అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాలో ఉరిశిక్ష సమయంలో నరసింహారెడ్డి బ్రిటిష్ వారిని ఉద్దేశించి కొన్ని డైలాగులు చెప్తారట. అవి సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. ఒక్కో డైలాగ్ కి ప్రేక్షకుల రోమాలు నిక్కబోడుచుకుంటాయని, భారీ డైలాగ్ ల ను చిరంజీవి అనర్గళంగా చెప్పేశారని తెలుస్తోంది.

ఈ సీన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా థియేటర్లు విజిల్స్ తో మారుమ్రోగి పోతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు ఈ సినిమా లో హైలైట్ గా నిలుస్తాయని చిత్ర బృందం విశ్వసిస్తోంది.

ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చా తదితరులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

First Published:  19 March 2019 2:02 AM GMT
Next Story