Telugu Global
Cinema & Entertainment

మరొక స్టార్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ ?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ సమంతతో తప్ప మరే స్టార్ హీరోయిన్ తోనూ నటించలేదు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఏకంగా లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి నటిస్తున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, నయనతార కాంబినేషన్ లో సినిమా రాబోతోందని కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. తాజాగా ఒక తమిళ దర్శకుడు నయనతారకు […]

మరొక స్టార్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ ?
X

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ సమంతతో తప్ప మరే స్టార్ హీరోయిన్ తోనూ నటించలేదు.

అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఏకంగా లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి నటిస్తున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, నయనతార కాంబినేషన్ లో సినిమా రాబోతోందని కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.

తాజాగా ఒక తమిళ దర్శకుడు నయనతారకు ఒక కథ వినిపించాడట. ఆ కథ నయనతారకు నచ్చిందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హీరో పాత్రకు విజయ్ దేవరకొండ అయితే బాగుంటాడని నయన్ స్వయంగా చెప్పిందని టాక్.

ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని…. విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఇవ్వలేదని తమిళ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో మనం అప్పుడే చెప్పటం కష్టమే. పైగా ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో నటిస్తారో లేదో చూడాలి.

First Published:  19 March 2019 1:47 AM GMT
Next Story