Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ దర్శకుడి కెరీర్ ను గాడి లో పెట్టే పని లో నితిన్

ఇష్క్ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత, ఆ సక్సెస్ ని నిలుపుతూ, హీరో నితిన్ కెరీర్ కి ఊపు నిచ్చిన చిత్రం గుండె జారి గల్లంతైంది. ఈ సినిమా అటు మాస్ ని, ఇటు క్లాస్ ని అలరిస్తూ సూపర్ హిట్ స్టేటస్ ని దక్కించుకుంది. సినిమా లో ని పాటలు కూడా హిట్ అయ్యాయి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని ఈ చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ మంచి పేరు సంపాదించాడు. ఆ […]

ఫ్లాప్ దర్శకుడి కెరీర్ ను గాడి లో పెట్టే పని లో నితిన్
X

ఇష్క్ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత, ఆ సక్సెస్ ని నిలుపుతూ, హీరో నితిన్ కెరీర్ కి ఊపు నిచ్చిన చిత్రం గుండె జారి గల్లంతైంది. ఈ సినిమా అటు మాస్ ని, ఇటు క్లాస్ ని అలరిస్తూ సూపర్ హిట్ స్టేటస్ ని దక్కించుకుంది. సినిమా లో ని పాటలు కూడా హిట్ అయ్యాయి.

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని ఈ చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు నాగ చైతన్య తో ఒక లైలా కోసం చిత్రం చేసాడు. కానీ అది పెద్దగా ఆడలేదు. ఒక లైలా కోసం నిరుత్సాహ పరిచాక, ఈ దర్శకుడు మళ్ళీ పెద్దగా ఇండస్ట్రీ లో ఎక్కడా కనిపించలేదు. కొన్నాళ్ళు కన్నడ లో నిఖిల్ గౌడ తో చిత్రం చేద్దాం అని చూసాడు. ఆ సినిమా కి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టాడు. కానీ ఏది పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఇప్పుడు చివరికి తొలి చిత్రం అవకాశం ఇచ్చిన నితిన్ దగ్గరకే మళ్ళీ వచ్చి చేరాడు. తాజా వార్తల ప్రకారం నితిన్ విజయ్ కుమార్ చెప్పిన ఒక కథ నచ్చి ఇంప్రెస్ అయ్యాడట. వచ్చే సంవత్సరం మొదటి భాగం లో ఈ దర్శకుడి తో ఒక చిత్రాన్ని చేసేందుకు రెడీ గా ఉన్నాడట. ఈ డైరెక్టర్ తిరిగి సక్సెస్ ఫాం లో కి వస్తాడో రాడో వేచి చూడాలి మరి.

First Published:  18 March 2019 9:40 PM GMT
Next Story