Telugu Global
Cinema & Entertainment

మళ్లీ అదే తప్పు చేస్తున్న బయ్యర్లు

బెల్లంకొండ సాయిశ్రీనివాస్… ఈ హీరో తీసే సినిమాలకు బడ్జెట్ ఎక్కువ, రెవెన్యూ తక్కువ. బ్రేక్-ఈవెన్ అయిన సినిమాలు మరీ తక్కువ. అయినప్పటికీ తండ్రి బెల్లంకొండ సురేష్ లాబీయింగ్ తో ప్రతి సినిమా బాగానే అమ్ముడుపోతోంది. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినా మళ్లీ మళ్లీ భారీ రేట్లకు ఇతడి సినిమాను కొంటూనే ఉన్నారు. తాజాగా సీత కూడా అదే బాట పట్టింది. అవును.. బెల్లంకొండ నటించిన సీత సినిమా కూడా దాదాపు 25 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. బెల్లంకొండ మార్కెట్ తో […]

మళ్లీ అదే తప్పు చేస్తున్న బయ్యర్లు
X

బెల్లంకొండ సాయిశ్రీనివాస్… ఈ హీరో తీసే సినిమాలకు బడ్జెట్ ఎక్కువ, రెవెన్యూ తక్కువ. బ్రేక్-ఈవెన్ అయిన సినిమాలు మరీ తక్కువ. అయినప్పటికీ తండ్రి బెల్లంకొండ సురేష్ లాబీయింగ్ తో ప్రతి సినిమా బాగానే అమ్ముడుపోతోంది. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినా మళ్లీ మళ్లీ భారీ రేట్లకు ఇతడి సినిమాను కొంటూనే ఉన్నారు. తాజాగా సీత కూడా అదే బాట పట్టింది.

అవును.. బెల్లంకొండ నటించిన సీత సినిమా కూడా దాదాపు 25 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. బెల్లంకొండ మార్కెట్ తో పోల్చుకుంటే, వరల్డ్ వైడ్ ఈ సినిమా పాతిక కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం అంటే చాలా ఎక్కువ. ఈ విషయంలో మరోసారి నిర్మాతలు బెట్టింగ్ బాట పట్టారని అర్థమౌతూనే ఉంది.

తేజ ఈ సినిమాకు దర్శకుడు కావడం, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ఉండడంతో బయ్యర్లు కాస్త మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అలా చూసుకున్నప్పటికీ గతంలో బెల్లంకొండ-కాజల్ కలిసి చేసిన కవచం సినిమా బ్రేక్-ఈవెన్ కాలేదు. సో.. ఈసారి బయ్యర్ల ఆశలన్నీ తేజ పైనే అన్నమాట.

First Published:  20 March 2019 10:52 AM GMT
Next Story