Telugu Global
Cinema & Entertainment

'ఆర్ఆర్ఆర్' లో మరొక ఇద్దరు బాలీవుడ్ స్టార్లు?

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఒకటి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఈ సినిమా గురించి బోలెడు విషయాలు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ మరియు కోలీవుడ్ నటుడు సముద్రఖని లు ముఖ్య పాత్రలను పోషిస్తున్నట్లు రాజమౌళి […]

ఆర్ఆర్ఆర్ లో మరొక ఇద్దరు బాలీవుడ్ స్టార్లు?
X

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఒకటి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఈ సినిమా గురించి బోలెడు విషయాలు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ మరియు కోలీవుడ్ నటుడు సముద్రఖని లు ముఖ్య పాత్రలను పోషిస్తున్నట్లు రాజమౌళి ఇప్పటికే చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం మరొక ఇద్దరు బాలీవుడ్ నటుల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరియు వరుణ్ ధావన్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం లో కీలక పాత్రలను పోషిస్తున్నట్లు రూమర్లు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ దర్శక నిర్మాతలు వీరిద్దరిని ఒప్పించే పనిలో పడ్డారని వార్తలు వస్తున్నాయి.

దీనిపై రాజమౌళి అండ్ టీం ఇంకా రియాక్ట్ అవ్వాల్సి ఉంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది.

First Published:  20 March 2019 4:26 AM GMT
Next Story